Home ప్రకాశం నూతన ప్రజాపంపిణీ చట్టం(2018)పై రేషన్ డీలర్లకు అవగాహన సదస్సు

నూతన ప్రజాపంపిణీ చట్టం(2018)పై రేషన్ డీలర్లకు అవగాహన సదస్సు

361
0

చీరాల : చీరాపా అర్బన్, రురల్, వేటపాలెం, ఇంకొల్లు, పర్చూరు, కారెంచేడు మండలాల రేషన్ డీలర్లకు 2018నూతన ప్రజాపంపిణీ చట్టంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పద్మాసాలియ కళ్యాణమండపంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రేషన్ ఇవ్వడంలో ప్రకాశం జిల్లా 82శాతంతో రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందన్నారు.

దీనిని 90శాతానికి తీసుకెళ్లి జిల్లాను ప్రధమ స్థానంలో నిలపడనికి అందరూ కృషి చేయాలన్నారు. రేషన్ తీసుకోవడానికి అర్హులుగా ఉండి థంబ్ పడకపోవడం వల్ల రేషన్ తీసుకోలేని వారికి వీఆర్వో థంబ్ ద్వారా రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీలర్స్ అసోసియేషన్ చీరాల అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు అలుమురి నాగేశ్వరరావు, దుడ్డు ప్రభాకరరావు, రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు పెండెం నాగేశ్వరరావు, సప్రం శివశంకర్ బాబు, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.