Home విద్య పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి : కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాసరావు

పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి : కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాసరావు

586
0

చీరాల : విద్యార్థులు పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలనే అంశంపై కొత్తపేట జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శనివారం సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, మోటివేషనల్ స్పీకర్, కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాసరావు విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు. మానసిక ఒత్తిడిని నియంత్రించుకునే పద్ధతులు వివరించారు.

జ్ఞాపకశక్తి గురించి పిల్లలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించారు. ఆత్మహత్యలు దానికి దారితీసే కారణాల్ని చెప్పారు. ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించే విధానాన్ని చెప్పారు. విద్యార్థుల మనసు నుండి ఆ ఆలోచనలు పూర్తిగా తీసే విధంగా, సమయపాలన పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పారు. ఏ టైంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కారమార్గాన్ని అన్వేషించాలి అనే అంశాలను వివరించారు. అనేకరకాల సూచనల్ని పిల్లలకి తెలియజేశారు.

శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు విద్యార్థులకు జ్ఞాపకశక్తి చిట్కాలు చెప్పారు. మంచి మార్కులు ఏవిధంగా సంపాదించాల, విలువతో కూడిన విద్యను ఏవిధంగా పొందాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి హైస్కూల్ హెడ్మాస్టర్ ఇంద్ర ఇజ్రాయిల్, ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి, ఖురేషి పాల్గొన్నారు.