Home క్రైమ్ ఆగివున్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ

ఆగివున్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ

758
0

కనిగిరి : ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో శుక్రవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి ఉదయగిరి వెళుతున్న ఆర్టీసీ బస్సు డిగ్రీ కాలేజీ సమీపంలో ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు సీట్లో కూర్చొని ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థిని ఇరుక్కుపోయింది. కనిగిరి మండలం అట్లవారిపల్లెకు చెందిన అట్ల లక్ష్మీజయశ్రీ(18) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం తీరును ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన మరో ప్రయాణికుడిని వైద్యశాలకు తరలించారు. పోస్టు మార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.