చీరాల : రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు నిరవధిక సమ్మెలో ఉన్నారు. చీరాల మునిసిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేస్తున్న ధర్నాకు వైసిపి సంఘీభావం ప్రకటించారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంటరీ కోర్డినేటర్ నందిగం సురేష్ ధర్నాలో పాల్గొన్నారు. కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు తాము కార్మికుల వెన్నంటి ఉంటామన్నారు. ఆయన వెంట వైసిపి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కర్నేటి వెంకట్ ప్రసాద్, పేర్లి నాని, కర్నేటి రవి, బిసి అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య, ఎస్సి సెల్ కార్యదర్శి మద్దు ప్రకాశరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు బోనిగల జైసన్ బాబు, మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు బురదాగుంట ఆశీర్వాదం, అధికార ప్రతినిధి యడం రవిశంకర్, డేటా దివాకర్ పాల్గొన్నారు.
ధర్నాలో సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు దేవతోటి నాగేశ్వరరావు, ఎన్ బాబురావు, ఎవి రమణ, మునిసిపల్ యూనియన్ నాయకులు వై సింగయ్య, కెవిపిఎస్ కార్యదర్శి లింగం జయరాజు, ఎఐటియుసి నాయకులు ఎ బాబురావు, సాంయేలు, 5కోటి దాసు, డొక్కా సురేష్ పాల్గొన్నారు.