Home బాపట్ల రెడ్‌క్రాస్ వైద్య శిబిరానికి విశేష స్పందన

రెడ్‌క్రాస్ వైద్య శిబిరానికి విశేష స్పందన

3
0

చీరాల (DN5 News) : రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో గుంటూరు రమేష్ హాస్పటల్ సౌజన్యంతో స్థానిక రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని రెడ్‌క్రాస్ ప్రెసిడెంట్, తహశీల్దారు గోపికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు పేదల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయన్నారు. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే జబ్బులు గుర్తిస్తే పూర్తిగా నయం చేసే విధంగా వైద్యం పొందవచ్చని అన్నారు. గుంటూరు రమేష్ హాస్పటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నల్లమోతు కిరీటి రతన్, జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ సందీప్ వైద్య పరీక్షలు చేశారు. ఈ శిబిరంలో 125 మందికి గుండె వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎకో, రక్త పరీక్షలు ఉచితంగా చేసినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు. ప్రతినెలా వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ వైస్ ప్రెసిడెంట్ సూరంపల్లి తేజస్వి, సెక్రెటరీ జిఎవి ప్రసాద్, ఎంసీ నెంబర్లు పసుపుల వందనం, ఫిరోజ్, త్రోవగుంట అబ్దుల్, తడవర్తి చంద్రశేఖర్, డి విజయభాస్కర్, పల్లపోతు విశ్వనాథం, కార్యవర్గ సభ్యులు ఎస్ పవన్ కుమార్, నారాయణ పాల్గొన్నారు.