Home బాపట్ల ‘దేవకీ’ పుట్టినరోజు సందర్బంగా అన్నదానంకు బియ్యం బహుకరణ 

‘దేవకీ’ పుట్టినరోజు సందర్బంగా అన్నదానంకు బియ్యం బహుకరణ 

19
0

చీరాల (Chirala) : స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు, శ్రీకృష్ణ గోశాల అధ్యక్షుడు దేవకి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా పేరాల శివాలయంలో పేదలకు అన్నదానం చేయుటకు ఒక బస్తా బియ్యం, కోటయ్య అనాధ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, చీరాల, పేరాల దీన జన అన్నదాన సేవా సంఘంనకు ఒక బస్తా బియ్యం, వోలేటి అనంత లింగేశ్వరరావు మహాదేవ వేద పాఠశాల విద్యార్థులకు ఒక బస్తా బియ్యం, శ్రీకృష్ణ గోశాలకు రూ.1,500 నగదు శుక్రవారం అందజేశారు. ఆయనను వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సభ్యులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, అమరా బుల్లిబాబు, సుధాకరరావు, నారాయణమూర్తి, పూర్ణా, రవి, తుకారాం, శ్రీనివాసరావు, చెంగల రాయుడు, మూర్తి, రాంబాబు, రామకృష్ణ, చెన్న నారాయణ పాల్గొన్నారు.