చీరాల (DN5 News): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇంటింటికి టీడీపీ’ ప్రచార కార్యక్రమం పట్టణంలోని మార్కెట్ సెంటర్‌లో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వ విజయాలను తెలియజేస్తూ ప్రచురించిన కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ‘ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం’ అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు.






