Home బాపట్ల తక్కువ ధరకే నిత్యావసరాలు

తక్కువ ధరకే నిత్యావసరాలు

3
0

చీరాల (DN5 News): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్కువ ధరలకే ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు స్థానిక కూరగాయల మార్కెట్ వెనుక రోడ్డులోని బాబా రైస్ మిల్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం కౌంటర్‌ను ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య సోమవారం ప్రారంభించారు. తగ్గించిన ధరలకే బియ్యం విక్రయించనున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్ల కౌంటర్లు, 500 రైస్ మిల్లర్స్ ప్రత్యేక పాయింట్ల ద్వారా తగ్గించిన ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో చీరాల అబ్జర్వర్, చిలకలూరిపేట ఎఎంసి చైర్మన్ షేక్ కరీముల్లా, చీరాల ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, ఆర్‌డిఒ నరసింహారావు, బిజెపి జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకట రమణారావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్‌ నరసింహారావు, ఎన్‌డిఎ కూటమి నాయకులు పాల్గొన్నారు.