Home బాపట్ల సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

3
0

చీరాల (DN5 News): ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘చేనేత సేవ పథకం’ ద్వారా నేతన్నలకు ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. చంద్రబాబు పాల్గొనే సభ వేదిక, హెలీప్యాడ్ స్థలం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ బి ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సోమవారం పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహారావు, ఎపిఎస్‌పిడిసిఎల్ ఎస్ఈ ఆంజనేయులు, ఆర్ అండ్‌ బి ఈఈ వేణుగోపాల్, డిఈ నళిని, డిఎస్పీ మొయిన్‌, చీరాల, వేటపాలెం తహశీల్దార్లు గోపి కృష్ణ, గీతారాణి ఉన్నారు.