Home బాపట్ల 7న చీరాలకు రానున్న సిఎం చంద్రబాబు : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

7న చీరాలకు రానున్న సిఎం చంద్రబాబు : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

3
0

బాపట్ల (DN5 News) : ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలంలో నిర్వహించనున్న జాతీయ చేనేత రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ న్యూ విసి హలులో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవ కార్యక్రమానికి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇంకా మూడు రోజులు సమయం మాత్రమే ఉన్నందున అధికారులకు అప్పగించిన బాధ్యతలకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వేదిక ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, పార్కింగ్, తాత్కాలిక మౌలిక వసతులు, చేనేత ప్రదర్శనలు తదితర అంశాలపై సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చీరాల చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఓవర్ అల్ ఇంచార్జి జెసి, కాన్వయ్‌ సెక్యురిటీ ఇంచార్జి ఎస్‌పి, ప్రజా వేదిక ఇంచార్జి చీరాల ఆర్డీఓ, హెలీప్యాడ్ ఇంచార్జి బాపట్ల ఆర్డీఓ, పార్కింగ్, ఫుడ్ ఇంచార్జి రేపల్లె ఆర్డీఓ, విఐపి, పబ్లిక్ ఫుడ్ ఇంచార్జి డిఎస్ఓ, మెప్మా పిడి స్టాల్స్ ఇంచార్జి, 8 స్టాల్స్ అందులో పోలీసు, బే ఆఫ్ బాపట్ల, స్వర్ణ భవిత ఇంచార్జి డిఈఓ, సిపిఓ నోట్ తయ్యారు చేయాలని ఆదేశించారు.

సమావేశంలో ఇంచార్జి డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, బాపట్ల ఆర్డీఓ ఎ హరి కుమార్, డిఆర్డీఎ, మెప్మా, డ్వామా పిడిలు బి సింగయ్య, ఆనంద సత్యపాల్, విజయలక్ష్మి, డిఎం అండ్‌ హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, ఆర్టీసీ ఆర్ఎం విమల, సిపిఓ ఎఎస్ రాజు, డిటిసి పరందామరెడ్డి, డిఎస్ఓ జగన్మోహన్, ల్యాండ్ అండ్‌ రికార్డ్స్ ఎడి సాంబశివరావు, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ అనంతరాజు, పశుసంవర్ధక శాఖ జెడి వేణుగోపాల్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎఒ మల్లిఖార్జునరావు, కో ఆర్డినేటర్ సెక్షన్ పర్యవేక్షకులు షఫి పాల్గొన్నారు.