చీరాల (DN5 News) : స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్ అండ్ పిఎం హైస్కూలు గ్రౌండు సభ్యులందరికీ మణికట్టు బ్యాండ్లు కట్టి, మిఠాయిలు పంచి, అల్పాహారం ఏర్పాటు చేసి, స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ కుల, మత భేదాలు లేనిది, ధనిక, పేద వ్యత్యాసం లేనిది, బంధుత్వం కంటే గొప్పది స్నేహం ఒకటే అన్నారు. శ్రీకృష్ణుడు కుచేలుని స్నేహం లాగా మనం కలకాలం కలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో చారగుళ్ళ గురుప్రసాద్, దివ్వెల ప్రభాకర్, నారాయణమూర్తి, డాక్టర్ డేగల శ్రీనివాస్, మద్దుల నాగేశ్వరరావు, మాధవరావు, పూర్ణా, రమేష్, దేవకి సుబ్బారావు, తుకారాం, వీరాంజనేయులు, చెంగలరాయుడు, తిరుపతిరావు, బాబాజీరావు, దరియా సాహెబ్, మధు, డివి సురేష్, చలపతి పాల్గొన్నారు.






