Home బాపట్ల ఘనంగా న్యూ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారు ఆవిష్కరణ

ఘనంగా న్యూ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారు ఆవిష్కరణ

3
0

చీరాల (DN5 News) : కొత్తపేట ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న జయలక్ష్మి ఆటోమొబైల్స్ మారుతి షోరూంలో మారుతి సుజుకి నూతన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారును షోరూం మేనేజర్ ఎస్ గయాజ్ ఆధ్వర్యంలో కేపాల్ జిఎం కె సత్యనారాయణ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి ఆధునిక సాంకేతికతతో కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తోందని అన్నారు. షోరూం మేనేజర్ ఎస్ గయాజ్ మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన నూతన కారు వినియోగదారులకు అనువైన ధరలో అందుబాటులో ఉంటుందన్నారు. 6స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 1.0 లీటర్ టర్బో ఇంజిన్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో ఈ వాహనం లభిస్తుందని చెప్పారు. ఆసక్తి గల వినియోగదారులు బుకింగ్‌ల కోసం తమ షోరూంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జయలక్ష్మి ఆటోమొబైల్స్ ఎఎస్‌ఎం ఎం వెంకటేష్, టీమ్ లీడర్ కె విజయ్, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.