Home బాపట్ల సుబ్బారావు సేవలు అభినందనీయం

సుబ్బారావు సేవలు అభినందనీయం

3
0

చీరాల (DN5 News) : ఆర్టీసీ కార్మికునిగా, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ సీనియర్‌ సభ్యునిగా సుబ్బారావు సేవలు అభినందనీయమని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం అయ్యపరెడ్డి అన్నారు. సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక సీనియర్‌ సిటిజన్స్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన సన్మాన సభలో అయ్యపరెడ్డి మాట్లాడారు. సభకు బి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నాయకులను షాలువాలతో సత్కరించారు. సభలో బాపట్ల, ప్రకాశం జిల్లాల కార్యదర్శులు బి తిరుమలరెడ్డి, డి మల్లికార్జునరావు, పి తిరుపతిరెడ్డి, బాపట్ల జిల్లా గౌ అధ్యక్షులు జిఎస్‌ నారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం వసంతరావు, ఎన్‌ బాబురావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య, యోగానంద్‌, కుమార్‌, రాంబాబు, తులసీరావు, కెబికె రెడ్డి, ఎం అంకయ్య, భాస్కరరావు, హరిబాబు, రాంమ్మోహనరావు, మాణిక్యరావు, ఇమ్మానికేలు పాల్గొన్నారు.