Home బాపట్ల తల్లిపాలల్లో రోగ నిరోధక శక్తి

తల్లిపాలల్లో రోగ నిరోధక శక్తి

9
0

చీరాల (DN5 News) : స్థానిక తెల్లగాంది బొమ్మ సెంటర్లోని అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ సూపర్వైజర్ అన్నపూర్ణ మాట్లాడారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని చెప్పారు. ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకాగా పనిచేస్తాయని అన్నారు. బిడ్డకు ఆరు నెలలు నిండే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలలు నిండిన దగ్గర నుండి రెండేళ్లు వచ్చేవరకు అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలు కూడా కొనసాగించాలని తెలిపారు. దీనివలన బిడ్డతోపాటు తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. వివిధ రకాల క్యాన్షన్లు, ఇతర జబ్బులు తల్లిక వచ్చే ప్రమాదం తప్పుతుందని చెప్పారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం అన్నపూర్ణ, ఆశా కార్యకర్త గీత, 18వ వార్డు అంగన్‌వాడి కార్యకర్తలు సురేఖ, శ్యామల, వరకామేశ్వరి పాల్గొన్నారు.