Home ఉపాధి ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు

ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు

425
0

హైదరాబాద్‌: తెలంగాణ లో పోలీస్ ఉద్యోగాల నియామకాలకు కేసీఆర్ బెల్ మోగించారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుళ్ల పోస్టుల నియామక ప్రాథమిక పరీక్షలను రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ ప్రకటించింది. ఎస్ఐ ఉద్యోగాలకు ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని ప్రకటించారు. సెప్టెంబరు 2న ఉదయం ఐటీ, కమ్యూనికేషన్స్ ఎస్ఐ, మధ్యాహ్నం ఫ్రింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ నియామక అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

సెప్టెంబరు 30న కానిస్టేబుళ్ల నియామక ప్రాథమిక పరీక్ష ఉంటుందన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 10 ముఖ్యమైన ప్రాంతాల్లో పరీక్ష జరపాలని బోర్డు నిర్ణయించింది. కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ పరీక్ష మాత్రం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని కూడా నిర్ణయించారు. వ్యక్తిగత వివరాల్లో మార్పులను ఈనెల 14 వరకు support@tsprb.inకు మెయిల్ ద్వారా పంపించాలని కోరారు.