Home విద్య పరీక్షలను పండుగ లా భావించండి : సైకాలజిస్ట్ పాపారావు పసుపులేటి

పరీక్షలను పండుగ లా భావించండి : సైకాలజిస్ట్ పాపారావు పసుపులేటి

352
0

పొదిలి : 10వ‌ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులు పరీక్షలను ఒక పండుగ లా భావించాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోషియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పసుపులేటి పాపారావు పేర్కొన్నారు. పాఠశాలలో వ్రాసే పరీక్షలకు, పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్ తప్ప ఏ విషయాల్లో తేడా ఏమీ ఉండదన్నారు.

కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్షలు వ్రాయవచ్చన్నారు. తాళ్లూరు మండలం శివరామ పురం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రంగారావు అధ్యక్షతన విద్యార్దుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఒత్తిడి నిర్వహణ, మెమరీ టెక్నిక్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.