అమరావతి : తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కేసీఆర్ ఆంద్రావాళ్లనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎపి పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆంద్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే గ్రేటర్ హైదరాబాద్‌ను దక్కించుకున్నారా? అని కెసిఆర్‌ను ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఓ వైపు తెలుగోల్లంతా కలిసుండాలంటూనే జాగో బాగో అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను మంత్రి లోకేశ్ తప్పుపట్టారు. టిఆర్ఎస్‌లో టిడిపివాళ్లెంతమంది ఉన్నారో అందరికీ తెలుసుని అన్నారు.
శాసన మండలి లాబీలో సమావేశానికి వెళ్తూ మంత్రి నారా లోకేశ్ తెలంగాణ పరిణామాలపై కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఆంద్రావాళ్ల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ దక్కించుకుందా? అని నిలదీశారు.