Home క్రైమ్ బాలికకు మాయమాటలు చెప్పి…

బాలికకు మాయమాటలు చెప్పి…

421
0

చీరాల : మంచిగా మాటలు చెప్పాడు. చక్కగా… బంగారంలా చూసుకుంటానన్నాడు. నమ్మించి శారీరకంగా అనుభవించాడు. గర్భవతిని చేశాడు. తీరా వివాహం చేసుకోవాలని పట్టుబడితే చేసుకుంటానని చెప్పి ఇంటివద్ద ఉన్న బాలికను తీసుకెళ్లాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాడరేవుకు చెందిన మైనర్ బాలికను చీరాల గొల్లపాలెంకు చెందిన కొమ్మనబోయిన కృష్ణ తీసుకెళ్లాడు. చివరికి ముద్దాయిని డిఎస్పీ ప్రేమకాజల్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముద్దాయిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈపురుపాలెం ఎస్ ఐ హానోక్ పాల్గొన్నారు.