పొదిలి : ఎల్ఐసి ఏజెంట్లకు గ్రాట్యుటీ, కుటుంబ ఆరోగ్య భీమా అమలు చేయాలని కోరుతూ శనివారం భీమా కార్యాలయం ఎదుట ఏజెంట్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ ఏజెంట్లు కూడా చేసిన పాలసిలపై కమిషన్ తప్ప ఎలాంటి సౌకర్యాలు పొందలేని పరిస్థితి ఉందన్నారు. ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నష్టాలలో ఉన్న ఐడిబిఐ బాంక్ ను టేకోవర్ చేసుకోవాలన్న నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.