Home జాతీయం కర్ణాటక కింగ్ కుమారస్వామే…

కర్ణాటక కింగ్ కుమారస్వామే…

425
0

బెంగళూరు:  చారిత్రక ఘట్టానికి కర్ణాటక వేదికైంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో మొదటి నుంచి జేడీఎస్ నేత కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అందరూ ఊహించినట్లే ఆయన కింగ్ మేకర్ కాదు.. కర్ణాటకకు కింగ్ కాబోతున్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరనుంది.

కర్ణాటక సీఎంగా కుమారస్వామి ఈ నెల 21న అంటే సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జేడీఎస్‌తో పాటు కాంగ్రెస్ మంత్రి వర్గంలో భాగస్వామ్యంకు కల్పించాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన సమారు 20 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని జేడీఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కుమారస్వామి మాత్రం తన మంత్రివర్గాన్ని 30 మందితో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా కర్ణాటక పరిణామాలు బిజెపి దూకుడుకు, అప్రజాస్వామిక పోకడకు బ్రేకులు వేసినట్లయింది.