Home జాతీయం బల నిరూపణలో చేతులెత్తేసిన బీజేపీ : యడ్యూరప్ప రాజీనామా

బల నిరూపణలో చేతులెత్తేసిన బీజేపీ : యడ్యూరప్ప రాజీనామా

522
0

బెంగుళూరు : కర్ణాటక శాసనసభలో బీజేపీ వీగిపోయింది. సంఖ్యా బలం చూపలేకపోయారు. 104సీట్లు గెలిచినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ గవర్నర్ పిలిచారు. 15రోజుల గదువులో బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని రెండో రోజుల్లోనే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించడంతో బిజెపికి చుక్కెదురైంది. ఏఎల్ల్యేలను కొనుగోలు చేసే సమయం లేక ఛాతికల పడింది. దీంతో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తనకు సంఖ్యాబలం లేదని ప్రకటించి రాజీనామా చేశారు. దీంతో కర్నాటక రాజకీయం కొత్తమలుపు తిరిగింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి ప్రభుత్య ఏర్పాటుకు అవకాశాలు ఏర్పడనున్నాయి.