హైదరాబాద్ : గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల విధ్వంసం కేసులో ఎన్‌ఐఏ న్యాయస్థానం మంగళవారం తీర్పు ప్రకటించింది. ఈ కేసులో ఇద్దరిని దోషులుగా న్యాయమూర్తి నిర్ధారించారు. అరెస్టు చేసిన ఐదుగురిలో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. అనీక్ షఫీక్, అక్బర్ ఇస్మాయిల్‌ను దోషులుగా నిర్థారిస్తూ తీర్పు ఇచ్చారు.. వీరిద్దరికి శిక్షలపై తీర్పు సోమవారం ఇవ్వనున్నారు. సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్ షఫ్రుద్దీన్, సాధిక్ ఇసార్, అంజుమ్‌లను నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది.
2007 ఆగస్టు 25న లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్‌ఛాట్‌లో బాంబులు పేల్చిన ఘటన తెలిసిందే. ఆ దుర్ఘటనలో 44 మంది మృతిచెండారు. 68మంది పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్ బృందం విచారణలో తేల్చింది. రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ సహా పలువురిని ముద్దాయిలుగా అభియోగపత్రాల్లో పేర్కొంది. వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేసి చర్లపల్లి కారాగారంలో ఉంచారు. గత నెల 27న తుది విచారణ జరిపింది. తీర్పు మంగళవారం ఇచ్చారు.