చీరాల : జాన్ద్రపేట ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో చిల్లర నాణెముల పంపిణీ చేశారు. ఒంగోలు జోనల్ మేనేజర్ పి రామకృష్ణ చిల్లర నాణెముల పంపిణీని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. ప్రజలు, కాతాదారుల కోసం రూ.1, రూ.2, రూ.5నాణెముల జిల్లాలోని ఇతర శాఖల పరిధిలో కూడా పంపిణీ చేస్తామన్నారు. సామాజిక బాధ్యతగా భావించే ప్రజలు, ఖాతాదారులకు చిల్లర సమస్య పరిష్కారానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
జాన్ద్రపేట శాఖ పరిధిలో 500మంది చేనేత కార్మికులకు ముద్ర రుణాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జాన్ద్రపేట శాఖ మేనేజర్ మధుసూదనరావు, ఒంగోలు ఆంధ్రాబ్యాంక్ కరెన్సీ చేస్తూ మేనేజరు పీకే రాజేశ్వరరావు పాల్గొన్నారు.