చీరాల : వైద్యవృత్తిలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నూతన వైద్యబిల్లులోని జిఒ నెంబర్ 465ను వెనక్కు తీసుకోవడంపట్ల ఐఎంఎ వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చీరాల వచ్చిన ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ ఐఎంఎ హాలులో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.
వైద్య వృత్తిలో లోపభూయిష్టంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వైద్యలు ఆరోగ్య భీమా పథకం ద్వారా బాపట్లకు చెందిన డాక్టర్ ఈశ్వరప్రసాద్ కుటుంబానికి రూ.20లక్షల భీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఎ సహాయ కార్యదర్శి డాక్టర్ ఫనింద్ర, ఐఎంఎ చీరాల అధ్యక్షులు డాక్టర్ పోలవరపు వెంకటేశ్వరప్రసాద్, డాక్టర్ బాలశంకరరావు, డాక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు.