చీరాల : రోడ్డు మద్యలో పెద్ద చెరువులా నిలిచిన వర్షపు నీళ్లు. ఎక్కడ గుంట ఉందో… ఎక్కడ రాళ్లున్నాయో… ఏదీ కనిపించదు. ఎలా వెళ్లాలో తెలియదు. నీళ్లలోనుండే వెళ్లాల్లి. ద్విచక్రవాహన దారులైకైతే సర్కస్ ఫీట్లే. పొరపాటు గుంట మద్యలో బైకు ఆగిందంటే సైలెన్సలర్‌లోకి నీళ్లు వెళ్ల ఇక వాహనం పనికిరాకుండా పోతుంది. అలాగని దిగి నడిచి వెళ్లాలంటే బురద నీటిలో తడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇదీ చీరాల మండలం గవినివారిపాలెం – పిట్టువారిపాలెం గ్రామాల మద్య ప్రధాన రహదారి దుస్తితి. అధికారులకు తెలిసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో గ్రామస్థులకు అవస్థలు తప్పడంలేదు.