చీరాల : ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేర్చాలని చేతివృత్తుల కార్పొరేషన్ డైరెక్టర్ గొడుగులు గంగరాజు అధికారులకు సూచించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా పట్టణంలోని 13, 14, 15, 2, 3, 4, 5వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. సభల్లో చేతి వృత్తుల కార్పొరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగరాజు మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని చెప్పారు. సభలో మునిసిపల్ చైర్మన్ మొదడుగు రమేష్‌బాబు, కౌన్సిలర్ జంజనం శ్రీనివాసరావు, జి సత్యనారాయణ, తుపాకుల రఘునాదబాబు, ప్రత్యేక అధికారిని కె రాజ్యలక్ష్మి, కమిషనర్ షేక్ ఫజులుల్లా, డిఇ గణపతి, ఆర్ ఐ మర్రి మాల్యాద్రి పాల్గొన్నారు.