Home ప్రకాశం చీరాలలో ఘంటసాల విగ్రహ ఏర్పాటు

చీరాలలో ఘంటసాల విగ్రహ ఏర్పాటు

352
0

చీరాల : త్వరలో ఘంటసాల చైతన్య వేదిక, సీనియర్ సీటీజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల విగ్రహ నిర్మాణంకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. చీరాల ఎన్జీఓ భవన్లో వేదిక ప్రాంతీయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు.

చీరాల పరిసర ప్రాంతాల్లో భావితరాల కోసం ఘంటసాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో చుక్కపల్లి రామకోటయ్య, యెనిశెట్టి సత్యనారాయణ(వైఎస్), రావూరి వెంకటేశ్వర్లు, గాదె హారుహరరావు, అత్తులూరి రామారావు, బత్తుల బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.