Home విద్య ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

843
0

చీరాల : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఎంపికైన ఉపాధ్యాయుల జాబితా ప్రకటించారు. వీరిలో పేరాల ఎఆర్ఎం ఉన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు బేతాల సాన్మ‌న్‌రాజు, పేరాల మున్సిప‌ల్ ప్రాధ‌మిక పాఠ‌శాల ప్ర‌ధోనోపాధ్యాయులు జి అరుణ‌కుమారిలు జిల్లా ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల‌కు ఎంపిక‌య్యారు. వీరిని అంబేద్క‌ర్ ఐడియాలజీ ఫోరం ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ఐ బాబురావు, వైస్‌ఛైర్మ‌న్ యాతం మేరిబాబు, కె జుబిలీరాజు, పి జ‌య‌రాజు, సుమ‌తి అభినందించారు.