Home విద్య శ్రీ‌గౌత‌మి యాజ‌మాన్యంచే ప‌రీక్ష సామాగ్రి పంపిణీ

శ్రీ‌గౌత‌మి యాజ‌మాన్యంచే ప‌రీక్ష సామాగ్రి పంపిణీ

460
0

చీరాల : శ్రీ‌గౌత‌మి జూనియ‌ర్ క‌ళాశాల యాజ‌మాన్య ప్ర‌తినిధిలచే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతూ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రయ్యే విద్యార్ధుల‌కు ప‌రీక్షా సామాగ్రిని సోమ‌వారం ఉచితంగా పంపిణీ చేశారు. కెజిఎం బాలికోన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో విద్యార్ధినుల‌కు ప‌రీక్ష‌ల‌కు అవ‌స‌ర‌మైన పెన్నులు, హాల్‌టికెట్ క‌వ‌ర్లు, స్కేళ్లు, అట్ట‌లు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా శ్రీ గౌత‌మి ప్ర‌తినిధులు మాట్లాడుతూ ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు సాధించాల‌ని, ఎలాంటి భ‌యం, ఒత్తిడిలేకుండా ప‌రీక్ష‌లు రాస్తే మంచి మార్కులు వ‌స్తాయ‌ని చెప్పారు.

ప‌రీక్ష‌ల్లో ముందు బాగా తెలిసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాసిన అనంత‌రం ఇత‌ర ప్ర‌శ్న‌ల‌కు సాధానాలు రాస్తే స‌మ‌యం క‌లిసి వ‌స్తుంద‌ని చెప్పారు. ప‌రీక్ష‌ల‌ను ఎలాంటి భ‌యం లేకుండా రాస్తే చేతి రాత‌కూడా ముచ్చ‌ట‌గా ఉంటుంద‌ని చెప్పారు. అలా ఉంటే మంచి మార్కుల‌తో ఉత్తీర్ణుల‌వుతార‌ని సూచించారు. వీరివెంట పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు పివి బాబు, శ్రీ‌గౌత‌మి ప్ర‌తినిధులు శ్రీ‌నివాస‌రావు, వ‌ర‌ప్ర‌సాద్‌, కోటేశ్వ‌ర‌రావు, పాఠ‌శాల ఉపాధ్యాయులు ప‌వ‌ని భానుచంద్ర‌మూర్తి ఉన్నారు.