Home ప్రకాశం ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం : పనబాక

ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం : పనబాక

425
0

చీరాల : ప్రభుత్వానికి ప్రజాసమస్యలు పట్టడం లేదని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ ఆరోపించారు. వేటపాలెం మండలం విజయనగర కాలనిలో ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ఆమె కాలనిలో పర్యటించారు. అనంతరం కాలనీ ప్రజలతో మాట్లాడారు. కాలనిలో మురుగునీటి పారుదల లేక దోమలతో అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ మెండు నిశాంత్, పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీను, సీనియర్ నాయకులు గుంటి ఆదినారాయణ, సయ్యద్ ఆలింబాబు, గుంటిరెడ్డి శశికళ, కరీం పాల్గొన్నారు.