Home విద్య చీరాల నుండి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులు

చీరాల నుండి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులు

635
0

చీరాల : జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. సృజనాత్మక విద్యాబోధనతో పాటు విద్యార్థులను సామాజిక అంశాలపై ప్రోత్సహిస్తున్న వారిని ఎంపిక చేశారు. వీరిలో కొత్తపేట జెడ్పి ఉన్నత పాఠశాల సీనియర్ అసిస్టెంట్ పవని భానుచంద్రమూర్తి, అంబేద్కర్ నగర్ ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులు డి శాంతారావు, గవినివారిపాలెం ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులు జి పిచ్చిరెడ్డి ఎంపికయ్యారు. ఎంపికైన ఉపాధ్యాయులకు ఒంగోలులో జరిగే సభలో అవార్డులు ప్రధానం చేయనున్నారు.