Home ఆంధ్రప్రదేశ్ దెబ్బకి దిగొచ్చిన సోము వీర్రాజు… అలక వీడి చేసిన ప్రకటన ఇదే…!

దెబ్బకి దిగొచ్చిన సోము వీర్రాజు… అలక వీడి చేసిన ప్రకటన ఇదే…!

474
0

అమరావతి : అధ్యక్ష పదవి రాకపోవడంతో అలిగి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సోము వీర్రాజు వెనక్కి తగ్గారు. పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేయలనుకున్న సోముకు ఒక్క రోజులోనే తత్వం బోధపడింది. దాంతో సోమవారం రాత్రికి అజ్ఞాతం వీడి పార్టీకి కట్టుబడి ఉంటానని సమాచారం పంపారు. ఇపౌడు ఇంకా ఎక్కువ చేస్తే వచ్చిన పదవి కూడా పోతుందని భయపడ్డారో ఏమో తనను నమ్మి రాజీనామలు ప్రకటించిన వారందరినీ బకరాలు చేస్తూ పార్టీ పట్ల వినాయవిధేయతలు ప్రకటించారు. సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వీర్రాజు ఫోన్‌ చేశారు. అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యామని, కార్యకర్తల సాయంతో పార్టీని బలోపేతం చేయాలని ఫోన్ ద్వారా పిలుపునిచ్చారు. కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి దక్కడంతో సోము వీర్రాజు కినుక వహించిన విషయం తెలిసిందే. ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కొత్త అధ్యక్షుడి ప్రకటన వచ్చిన ఆదివారం సాయంకాలం వరకూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సోమువీర్రాజు వర్గం ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసింది. తమ నేత సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, ఈ రెండు కమిటీలలోని కొందరు సభ్యులు ప్రకటించారు. తమ రాజీనామాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు పంపినట్టు తెలిపారు.

అలా తిరుబాటు ప్రకటించిన సోము 24 గంటలు కూడా గడవక ముందే మెత్తపడ్డారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఆయన ఓ లేఖ పంపారు. అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తామని స్పష్టంచేశారు. అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి కార్యకర్తలు పార్టీని బలోపేత చేయాలని లేఖ ద్వారా పిలుపునిచ్చారు. దీనికి ముందు సోము వీర్రాజు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. బీజేపీలో సీనియర్‌ నాయకుడైన సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవిని చాలాకాలం నుంచి ఆశిస్తున్నారు. గతంలో ఒక్కసారి వచ్చినట్లే వచ్చి దక్కకుండా పోయింది.

కంభంపాటి హరిబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కొద్దిరోజుల క్రితం రాజీనామా చేయడంతో పార్టీ జాతీయ అధిష్ఠానం పలు పేర్లను పరశీలించింది. అందులో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణపేర్లు ఉన్నాయి. కాని ఈ పదవి సోము వీర్రాజుకు ఖరారైందనే ప్రచారం జరగడంతో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. తరువాత ఆయనకు అనారోగ్యం రావడంతోపాటు బీజేపీ అధిష్ఠానం నుంచి హామీ రావడంతో వైసీపీలో చేరడం విరమించుకున్నారు. ఇక అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశారు. ఈ క్రమంలోనే ఇంకా బెత్తు చెసి ఉపయోగం లేదని తెలిసి సోము వెనక్కి తగినట్లు తెలుస్తోంది.