Home ఆంధ్రప్రదేశ్ కన్నాకి పదవి అలంకరమే… పగ్గాలన్నీ ఆయన చేతిలోనే… మోడీ-షా మార్కు ట్రీట్మెంట్

కన్నాకి పదవి అలంకరమే… పగ్గాలన్నీ ఆయన చేతిలోనే… మోడీ-షా మార్కు ట్రీట్మెంట్

408
0

అమరావతి :  కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించడంపై బీజేపీ అనేక విమర్శలు వస్తున్నాయి. ఒక సామాజిక వర్గం ఓట్ల కోసం సిద్దాంతాలను పక్కన పెట్టి కన్నాకి పదవి ఇచ్చిన మోడీ – షా ద్వయం తీరుపై అనేక వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు… ఇక్కడి టీడీపీని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో మోడీ – షా ద్వయం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టి నాలుగేళ్ళ క్రితం పార్టీలో చేరి… మళ్ళీ పార్టీ వదిలేసి పోదాం అనుకున్న కన్నాను తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టారు. ఇదే ఇప్పుడు బీజేపీ తీరును విమర్శల పాలు చేస్తోంది. అయితే కన్నాకు పదవి వెనుక మోడీ – షా ద్వయం ఆలోచన వేరేలా ఉందన్నది రాజకీయ విశ్లేషకులు మాట. నిజానికి కన్నాను పదవి ఇచ్చింది రాష్ట్రంలో ఒక వర్గాన్ని సంతృప్తి పరచి వారిని తమ వైపు తిప్పుకొనేందుకేనన్నది పరిశీలకుల మాట.

దీనికి వారు చేస్తున్న విశ్లేషణ… లాజిక్కులు ఆశక్తికరంగానే అంగీకరయోగ్యంగానే ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంలోనే అమిత్ షా మెలిక పెట్టారన్నది వారి వాదన. కన్నాను అస్త్ర అధ్యక్షుడిని చేస్తూ ఆదివారం జారీ అయిన ప్రకటనలో రెండు అంశాలున్నాయి. వాటిలో మొదటిది రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం. రెండోది అధ్యక్ష పదవి ఆశించిన సోము వీర్రాజుకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి. ఇప్పటి వరకు ఇలాంటి పదవి బీజేపీ చరిత్రలో లేదు. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు అంటే అతనే సుప్రీం. ఆయన చెప్పినట్లే రాష్ట్ర విభాగం పని చేస్తుంది. ఆ రాష్ట్రంలో పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్ని అధ్యక్షుడే.

అలాంటిది తొలిసారిగా ఏపీలో మాత్రమే అధ్యక్షుడికి తోడుగా ఒక ఎన్నికల కమిటీని పెట్టి దానికి సోము వీర్రాజును చైర్మన్ చేశారు. అంటే ఒక రకంగా కన్నాను అధ్యక్షుడిగా నియమిస్తూ జారీ చేసిన అదేశాల్లోనే ఆయనకు చెక్ పెట్టేలా సోముకు మరో పదవిని కట్టబెట్టిన ఆదేశాలను కూడా జత చేశారు. అంటే ఆ ఆదేశాల నుంచే కన్నాకు చెక్ పాయింట్ స్టార్ట్ అయిందన్నమాట. ఇక వచ్చేది ఎన్నికల ఏడాది. అంటే ఇక్కడి నుంచి రాజకీయం అంత ఎన్నికల చుట్టూనే తిరుగుతుంది. అలాంటప్పుడు ఎన్నికల కమి చైర్మన్ కీలకం అవుతారా… లేక అధ్యక్షుడి మాటే చెల్లుతుందా అనే స్పష్టత లేదు.

పైగా ఇక్కడ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఎక్కడైనా ఇలాంటి పదవులు ఇచ్చెపుడు నేతలు సామాజికంగా కూడా సమతుల్యత చూస్తారు. కానీ మోడీ – షా ద్వయం ఇందుకు భిన్నంగా రెండు ముఖ్యమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలను కూర్చోబెట్టింది. ఈ నేపథ్యంలో కన్నాకు అధ్యక్ష పదవి ఇచ్చి తురుపు ముక్కగా ప్రయోగించారని, ఆయనకు ఆ పదవి అలంకార ప్రయమేనన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఒకవేళ ఏదైనా ఒక నిర్ణయంలో అధ్యక్షుడు, ఎన్నికల కమిటీ చైర్మన్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తితే చివరకి ఎవరి మాట నెగ్గుతుంది.

దీనికి ఏ మాత్రం ఆలోచించకుండానే సోము వీర్రాజు అని సమాధానం చెప్పేయొచ్చు. ఎందుకు అంటే బీజేపీలో సోము సీనియర్ ఆయనకే సంఘ్ మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. అదీకాక సంఘ్ లో పని చేసిన అనుభవం వీర్రాజుకు ఉంది. ఆ పరిచయాలు ఉపయోగించి తన మాట నెగ్గేలా చేసుకోవడం సోముకు పెద్ద పని కాదు. మరి కన్నా ఏం చేయాలి. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి ఇవాళ అధ్యక్షుడు అయిన లక్ష్మీనారాయణ ఎవరి మద్దతుతో తన అధికారం చెలాయించాలి. అసలు చేలాయించడానికి ఆయనకు అధికారం ఉందా. మోడీ – షా ద్వయం ఇక్కడా రాజకీయ జిమ్మిక్కులు ప్రదర్శించారా? ఏమో ఏం చెబుతాం.