చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ కంప్యూటర్ సైన్సు విద్యార్థులు రూపొందించిన పరిశోధన పత్రం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణ, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. బిటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు పి సాయి శిరిష, ప్రవీణ్ కుమార్, హర్షవర్ధన్లు ”ఎ నావేల్ అప్రోచ్ ఫర్ సెర్చబల్ కీవర్డ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్” అంశంపై అధ్యాపకులు జె కార్తీక్ పర్యవేక్షణలో రూపొందించిన పరిశోధన పత్రం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైనట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్, హెచ్ఓడి డాక్టర్ పి హరిణి అభినందించారు.