చీరాల : యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో జవహార్ నాలెడ్జ్ సెంటర్, కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు వ్యక్తత్వ వికాసం – నైపుణ్యాభివృద్ది అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ వి కృష్ణభాస్కర్ మాట్లాడారు. డిగ్రీ పట్టాతోపాటు బాహ్యప్రపంచంలోకి వెళ్లి ఉద్యోగం కోసం పోటీ పడి గెలవటానికి కావాల్సిన నైపుణ్యాన్ని నేర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ జి రాజరాజేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు.