చీరాల : తెలుగు బాషలో ఉన్న మాధుర్యం తెలుసుకోవాలని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య పేర్కొన్నారు. కళాశాల ఆవరణలో తెలుగులో నీతి కావ్యాలు – యువతకు మార్గదర్శకాలు అంశంపై వర్క్‌షాపు నిర్వహించారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి తెలుగు అధ్యాపకులు డాక్టర్ జి జానీ్సరాణి మాట్లాడారు. బోధనలో అంతా నైతిక విలువల ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎన్ని శాస్ర్తాలు నేర్చినా తెలుగు బాష ఔన్నత్యం విశ్వవిఖ్యాతమని పేర్కొన్నారు. ద్రవిడ బాషల్లో ప్రధానమైన తెలుగు బాష సంస్కృతి ప్రత్యేకంగా ఉంటుందన్నారు. విదేశీయులు సైతం తెలుగును నేర్చుకుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసించారని చెప్పారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది తెలుగు మాట్లాడేవాళ్లే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు జె శ్యామలాదేవి, డాక్టర్ జాగర్లమూడి అనూరాధ, డాక్టర్ ఎల్‌జె నాయుడు, వై సుబ్బరాయుడు, టి పోలయ్య పాల్గొన్నారు.