అమరావతి : నేటి నుండి ఆంధ్రప్రదేశ్ శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఉదయం 7.30గంటలకు నివాళులర్పించనున్నారు. ఆయనతోపాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఉదయం 8.30 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహాసంఘం (బీఏసీ) భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఖరారు చేయనున్నారు. ఎనిమిది రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.