ఒంగోలు : భాగ్యనగర్‌లో నూతనంగా ఆధునీకరించిన పార్కును శాసన సభ్యులు దామచర్ల జనార్ధనరావు ఒంగోలు మున్సిపల్ కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. పార్క్నందు ఏర్పటు చేసిన ఓపెన్ జీమ్ పరికరాలు, పిల్లలకు ఆహ్లదాన్నందించే ఆటల పరికరాలను, వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించారు. ట్రంకురోడ్డులోని అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదవాళ్ళు డబ్బులేదనే కారణంతో ఆకలితో ఉండకూడదనే ఉద్దేశమే అన్న క్యాంటిన్ల స్ధాపన అని అన్నారు. పివిఆర్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన మారుతి కల్చరల్ మెగా ఎక్జిబిషన్‌ను ప్రారంబించారు. దసర సెలవులలో విద్యార్ధులకు వినోదాన్నిచ్చే ఇంలాంటి కార్యక్రమాలు మంచివన్నారు. మారుతి కల్చరల్ ఎక్జిబిషన్ నిర్వాహకులు ఈదుపల్లి శివ మాట్లాడుతూ పట్టన ప్రజలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంత్సరంకూడా ఎక్జిబిషన్‌ను ఆధరించాలని కోరారు.