Home జాతీయం యడ్యూరప్పకు షాక్… సుప్రీం కోర్టు సంచలన తీర్పు

యడ్యూరప్పకు షాక్… సుప్రీం కోర్టు సంచలన తీర్పు

585
0

బెంగుళూరు : కర్ణాటకలో ప్రజాస్వామ్యం గొంతు నులమాలనుకున్న బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. సంతలో సరుకుల్లా ఎమ్మెల్యేలను కొని పబ్బం గడుపుకొవాలానుకున్న బీజేపీకి సర్వోన్నత న్యాయస్థానం బ్రేకులు వేసింది. బలపరీక్షకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చారు. దీనిపై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. ఎక్కువ సమయమ లేదు రేపు సాయంత్రంలోపు బలం నిరూపించుకోవాలని ఆదేశాలిచ్చింది. శాసనసభలో బల పరీక్ష జరిగే వరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని యడ్యూరప్పను ఆదేశించింది.

వెంటనే తాత్కాలిక స్పీకర్‌ను నియమించాలని చెప్పింది. ఎటువంటి పదవుల్లోనూ నాయకులను నియమించవద్దని స్పష్టం చేసింది. బలపరీక్షలో గెలిచిన తర్వాత మాత్రమే యడ్యూరప్ప విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష జరుగుతుంది.

యడ్యూరప్ప ప్రభుత్వం బల పరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని నిర్ధేశించింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే ఈ ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం అందికరించలేదు.