బాపట్ల : వైసిపీ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా కోడూరు ప్రసాదరెడ్డి నియమితులయ్యారు. వైసిపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తనకు ఉపాధ్యక్ష బాధ్యత అప్పగించిన వైసిపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, బాపట్ల జిల్లా వైసిపీ అధ్యక్షులు మేరుగ నాగార్జున, మాజీ ఎంఎల్ఎ కరణం బలరామ కృష్ణమూర్తి, వైసిపీ నియోజకవర్గం ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు, పార్టీ సీనియర్ నాయకులకు ప్రసాదరెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని బలోపేతం చేయటానికి యువజన విభాగం నాయకులను కలుపుకొని పార్టీ ప్రతిష్టతకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.