చీరాల : వాడరేవు సముద్ర తీరంలోని ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన పౌర్ణమి సందర్భంగా జేష్ట పౌర్ణమి సాగర హారతి హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రమఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు, బండారు జ్వాల నరసింహం, అర్చక స్వాములు, వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ, సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం, సామూహిక సాగర హారతి నిర్వహించారు. కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు స్వయంభు సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చముండేశ్వరి అనుగ్రహం పీఠాధిపతులు, రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక దివ్య దైవిక సంపాదకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి చేతుల మీదుగా అభిషేకం, సాగర హారతి నిర్వహించారు. కార్యక్రమంలో మున్నం శ్రీనివాసరెడ్డి, దామిశెట్టి శ్రీనివాసగుప్తా, వెంకటేశ్వరరెడ్డి, పిక్కి రాంబాబు, కోటి శ్రీను, చిట్టి బాబు, సున్నం శ్రీనివాస్, పిక్కి నారాయణ, గోలి సాంబశివరావు, బుర్ల సాంబశివరావు, తడవర్తి చంద్ర, రాజేష్, డాక్టర్ సభరి, గుమ్మ బాలాజీ, హిందూ చైతన్య వేదిక సభ్యులు, భజన బృందం సభ్యులు, ఓడరేవు టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.