చీరాల : జులై 22న ఒంగోలు ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం ఆవరణలో టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సన్మాన కార్యక్రమం జరుగుతుందని ప్రకాశం జిల్లా యాదవ ఐక్యవేదిక నాయకులు జాడ బాలనాగేంద్రబాబు యాదవ్ తెలిపారు. మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావును కలిసి సభకు ఆహ్వానించారు. అనంతరం జరిగిన పాంప్లెట్ ఆవిష్కరన కార్యక్రమంలో మాట్లాడుతూ చీరాల, పర్చూరు చుట్టుపక్కల గ్రామాల్లోని యాదవులు పెద్ద సంఖ్యలో మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఆధ్వర్యంలో హాజరై జయప్రదం చేయాలని ఎంపిపి గవిని శ్రీనివాసరావు కోరారు. కార్యక్రమంలో యాదవుల ఐక్యవేదిక నాయకులు జమ్ము రత్తయ్య యాదవ్, రావులపల్లి ధనలక్ష్మి యాదవ్, గాలం ప్రభాకర్ యాదవ్, జాజుల శ్రీనివాసరావు యాదవ్ పాల్గొన్నారు.