చీరాల : విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ఆవరణలో బిఇడి నాలుగోసెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశీలకులు నగేష్, హనుమంతరావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన తహశీల్దారు ఎం వెంకటేశ్వర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. 424మంది అభ్యర్ధులకు గాను 403మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈనెల 26వరకు పరీక్షలు జరుగనున్నాయి. తహశీల్దారు వెంట కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మయ్య, తెలుగు అధ్యాపకురాలు అనూరాధ ఉన్నారు.