Home క్రైమ్ చెల్లెలును హత్య చేసిన అన్న అరెస్ట్ – రిమాండ్

చెల్లెలును హత్య చేసిన అన్న అరెస్ట్ – రిమాండ్

508
0

చీరాల : ఈ నెల 2న స్వర్ణ గ్రామంలోని శివాలయం వీధిలో సుంకర పద్మావతితో పొలంలో హద్దులు విషయంలో వచ్చిన వివాదాలను మనసులో పెట్టుకుని స్వయానా తన పెద్దన్నాన్న కుమారుడైన సూదా సింగయ్య అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటనలో ముద్దాయి అయిన సూదా సింగయ్యను స్వర్ణలోని అతని ఇంటివద్ద చీరాల రూరల్ సిఐ భక్తవత్సలరెడ్డి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. పర్చూరు మేజిస్ట్రేట్ విచారించి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ముద్దాయిని జిల్లా కారాగారానికి తరలించారు. ఈ కేసులో సమర్ధవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసిన రూరల్ సిఐని, కారంచేడు పోలీస్ సిబ్బందిని చీరాల డిఎస్పీ అభినందించారు.