Home ప్రకాశం చంద్రన్న పసుపు – కుంకుమపై సదస్సులో డోలా

చంద్రన్న పసుపు – కుంకుమపై సదస్సులో డోలా

448
0

కొండపి : శ్రీసాయి సీతారామ కళ్యాణమండపంలో చంద్రన్న పసుపు – కుంకుమ, వడ్డీ రాయతీపై గ్రామ సమాఖ్య లీడర్లు, వెలుగు సిబ్బందికి అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. సదస్సులో కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మహిళలకు చెక్కులను అందజేశారు.

కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ రామయ్య చౌదరి, జన్మభూమి కమిటీ సభ్యులు యాలమంద నాయుడు, బిసి సెల్ నాయకుడు నారాయణ స్వామి, కొండపీ ఎంపీపీ దేపూరి రతమ్మ, టంగుటూరు ఎంపీపీ చంద్రశేఖర్, జరుగుమల్లి ఎంపీపీ పోటు పద్మావతి, జడ్పీటీసీ గాలి పద్మావతి, 6 మండలాల ఏపిఎంలు, 6 మండలాల సమైక్య లీడర్లు పాల్గొన్నారు.