Home ప్రకాశం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై స్పందించిన కమిషనర్ వెంకటకృష్ణ

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై స్పందించిన కమిషనర్ వెంకటకృష్ణ

427
0

ఒంగోలు : నగరపాలక సంస్ధ కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మున్సిపల్ పారిశుద్య కార్మికుల సమ్మెపై స్పందించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్య కార్మికులు గత 5రోజులుగా జిఒ నెం.279, ఆర్టిఎంఎస్ విధానాన్న రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ సమ్మెలో ఉన్నారు. పురపాలక సంఘాలలో పూర్తి స్దాయిలో ప్రజలకు పారిశద్య సేవలు అందించేందుకు, ప్రతి ఇంటి నుండి క్రమం తప్పకుండా చెత్త సేకరణ, రవాణా కొరకు ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక విధానమే జీఒ నెం.279 అని కమిషనర్ చెప్పారు.

ఈ విధానం ద్వారా కార్మికుల సంక్షేమం, భద్రత కొరకు అన్నిచర్యలు చేపట్టబడ్డాయన్నారు. ఈ విధానానికి సంబందించిన విధివిదానాలను స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ విధానం రాష్ట్రంలో 54మున్సిపాలిటీలలో అమలులో ఉందని తెలిపారు. ఈ విదానం వల్ల కార్మికులు 8 గంటలు మాత్రమే పనివిధానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతినెల 5వ తేదిన జీతం చెల్లించబడుతుందని చెప్పారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు ఈ విధానం ఒక కంచెలా పనిచేస్తుందన్నారు.

సమ్మెలో ఉన్న కార్మికులు విధులు నిర్వహించే కార్మికులను పనిలోనికి వెళ్ళకుండ బెదిరిపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోచేస్తామని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదైన వారిని విధులలోకి తీసుకొవడం ఎట్టిపరిస్ధితుల్లోను జరగదిని ఆయన హెచ్చరించారు.