Home ఆంధ్రప్రదేశ్ కన్నుల పండుగలా సాగర హారతి 

కన్నుల పండుగలా సాగర హారతి 

329
0

చీరాల : వాడరేవు సముద్రతీరంలోని ఆంజనేయ స్వామి ఎదురుగా పౌర్ణమి సందర్బంగా శనివారం సామూహిక సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రముఖ డాక్టర్ తాడివలస దేవరాజు, బండారు జ్వాల నరసింహం, అర్చక స్వాములు, వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్పటిక శివలింగానికి పంచామృతలతో అభిషేకం, మంత్ర పుష్పం, సామూహిక సాగర హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ధర్మదేవత బిరుదాంకితులు, గుంటూరు జిల్లా తాళ్ళాయపాలెంకు చెందిన శ్రీ శైవక్షేత్ర పిఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మచారి శివస్వామీజీ పాల్గొని పంచామృత అభిషేకం చేసి, సాగరానికి హారతి ఇచ్చారు.

శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మచారి శివస్వామీజీ మాట్లాడుతూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంల చీరాలలో ఘనంగా సాగర హారతి నిర్వహిస్తున్నారని, హిందూ బంధువులు జనవరి 5న విజయవాడలో జరుగు హిందూ శంఖారామానికి హాజరై జయపతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పిక్కి నారాయణ, గురవయ్య, రామకృష్ణ, ఓడరేవు టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు, పూజారి కారంచేటి నగేష్ కుమార్, కార్తీక్ శర్మ, విట వెంకటేశ్, కోటి గోపి యాదవ్, రఘు, అంబటి మారుతి రామ్, వేద శ్రీ, శ్రీనివాస్ వుల్లగంటి, డాక్టర్ శబరి గుప్త, లక్షమి శ్రీనివాస్, భవాని, శ్రీ మహాలక్ష్మి మహిళా భజన బృందం సభ్యులు, ఓడరేవు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.