Home జాతీయం చంద్రబాబుకు రూ.9లక్షలు… సీతారాం ఏచూరికి రూ.64వేలు…!

చంద్రబాబుకు రూ.9లక్షలు… సీతారాం ఏచూరికి రూ.64వేలు…!

656
0

బెంగుళూరు : ఏపీ సీఎం చంద్రబాబుకు రూ.8.73 లక్షలు… యూపీ మాజీ సీఎం అఖిలేష్ కి రూ.లక్షా… బీఎస్పీ అధినేత్రి మాయావతికి రూ.1.50లక్షలు, కేరళ సీఎంకు రూ.1.20లక్షలు, సిపిఎం జాతీయ కార్యదర్శి కి రూ.64వేలు. ఏమిటీ లక్షలు లక్షన్నరలు అంటారా…? ఒక ప్రమాణ స్వీకార వేడుకకు హాజరైన ఈ వీవీఐపీలకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు.

వివరాల్లోకి వెళ్తే మూడు నెలల క్రితం కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కొలువుదీరిన రోజు తెలుసుకదా…! నాటకీయ పరిణామాల మధ్య కుమారస్వామి గద్దెనెక్కారు. సుప్రీం కోర్టు అర్ధరాత్రి విచారణలు… ఎమ్యెల్యేల క్యాంపులు… వెరసి మోడీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన విపక్షాలన్నీ ఒక వేదిక మీదకు వచ్చారు. ఆ రోజు కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, యూపీ మాజీ సీఎం మాయావతి, ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ మాజీ సీఎం అఖిలేష్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇలా ఎందరో వివిఐపిలు ఆనాటి ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టి వేదికపై చేతులు కలిపారు. మోడీపై సమరసంఖం పురిస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు. అయితే ఆ రోజు వచ్చిన ఈ వీవీఐపీల కోసం ప్రజాధనం ఖర్చుల లెక్కలు ఇపౌడు బయటకు వచ్చాయి. స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఒక్కో నేతకు ఒక పుటకి ఇచ్చిన కాఫీ టి పానీయాలకు అయిన ఖర్చు చూస్తే ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. ఇదంతా ప్రభుత్వం సొమ్ము కావడంతోనే ఇపౌడు వివాదం రేగుతోంది.

మే 23న జరిగిన ఈ ప్రమాణస్వీకారం సభకు వచ్చిన అతిథులకు కుమారస్వామి ఘనంగా అతిధి మర్యాదలు చేశారని తాజాగా ఓ జాతీయ పత్రిక సంచలన విషయాలు బయట పెటింది. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో అతిథులకు కుమారస్వామి ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది. వారికి ఖర్చు చేసిన బిల్లులు ఇవేనంటూ సాక్షాలతో సహా ఒక కథనాన్ని ప్రచురించదాంతో ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆర్టీఐ కార్యకర్త సేకరించిన సమాచారం ప్రకారం కేవలం ఏడు నిమిషాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుమారస్వామి ప్రభుత్వం మొత్తం రూ.42లక్షల ప్రజా ధనాన్ని అతిధి మర్యాదలకు ఖర్చుపెట్టింది. ఆ పత్రిక కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మే 23న హోటల్‌కి చేరుకుని మరునాడు అంటే మే 24న ఖాళీ చేసారు. ఆయన పేరుపై అక్షరాలా రూ.8,72,485ల బిల్లు కావడం గమనార్హం. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరుతో రూ.1.85లక్షలు చేశారు.

వీరితోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్ పేరుతో రూ. 1.2 లక్షలు, మాయావతి రూ. 1.41 లక్షలు, కేరళ సీఎం పినరయి విజయన్ ఖర్చు రూ. 1.2లక్షలు, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ రూ. 1.2 లక్షలు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి రూ. 64 వేలు, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ రూ. 38 వేలు, ఎన్సీపీ నేత శరద్ పవార్ పేరిట రూ. 64 వేలు బిల్లులను ప్రభుత్వం ఖర్చు చూపింది. వీటితోపాటు విధాన సభ హాల్‌లో మే 23న ఇచ్చిన తేనీటి విందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల రూ.4.35 లక్షలు ఖర్చు చేసినట్లు నమోదైంది. టీ, స్నాక్స్ కూడా తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌ నుండి తెప్పించినట్లు ఆ జాతీయ పత్రిక ప్రకటించింది. ఈ ఖర్చులపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.