Home జాతీయం మోడీతో కేసీఆర్ స్నేహాన్ని విమానం ఎలా బయట పెట్టిందో చూడండి…

మోడీతో కేసీఆర్ స్నేహాన్ని విమానం ఎలా బయట పెట్టిందో చూడండి…

588
0

అమరావతి : కాంగ్రేస్, బిజెపికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆ మధ్య కేసీఆర్ దేశమంతా తిరిగారు. కానీ ఉన్నట్లు ఉంది అన్ని వదిలేసి ఒక్కసారిగా మోడీకి మిత్రుడయ్యారు. ఇది ఎలా సాధ్యం. అందరిని తొలిచిన ప్రశ్న. ప్రధాని మోడీతో కేసీఆర్ బంధం ఏమిటో తెలిసిపోయింది. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి అంటూ దేశమంతా తిరుగుతానన్న కేసీఆర్ అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. బీజేపీకి జై కొట్టారు. దీని వెనుక ఉన్నదేవరో తెలిపోయింది. బేషరతుగా బీజేపీకి మద్దతు పలికాదు. అంతేకాదు రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థికి కేసీఆర్ ఎంపీలు ఓటు వేయించారు. ఈ పరిణామం వెనుక కారణాలు ఏమిటో… ఎవరి ప్రోద్భలంతో టిఆర్ఎస్ బీజేపీకి అనుకూల వైఖరి తీసుకుందో తేలిపోయింది.

ఇటీవల కాలంలో తరచు కేసీఆర్ కి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుండడం వెనుక రహస్యం వెల్లడి అయ్యింది. కేసీఆర్ కి మోడీకి మధ్య సత్సంబంధాలు రావడానికి కారణం బీజేపీ అనుకూల వ్యాపారవేత్త అదాని అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు ప్రధాని మోడీతోను, ఎన్డీఏ ప్రభుత్వంతోనూ సత్సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ్య డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థికి ఓటేశారని అన్నారు. కేసీఆర్ కు ప్రధాని మోదీకి మద్య సంధానకర్తగా ఆదానీ వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకోసం ఆదానీ సంస్థకు కేసీఆర్ సహయసహకారాలు చేస్తున్నారు.

చత్తీస్ ఘడ్ లోని మార్వా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఆదానీ కంపనీ బొగ్గును సరఫరా చేస్తున్నందునే అక్కడి నుండే కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఇలా చేసుండకపోతే ఆదానీ గ్రూప్ దివాల తీసేదని రేవంత్ పేర్కొన్నారు. ఇలాంటి లబ్ధి చేకూరుస్తున్నాడు కాబట్టే మొన్న కరుణానిధి పార్థీవ దేహాన్ని చూడటానికి కేసీఆర్ వెల్లాడు. కేసీఆర్ కు ఆదానీ తన సొంత విమానాన్ని ఇచ్చారని ఆరోపణలు చేశారు.

రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో బిజెపికి టీఆర్ఎస్ మద్దతివ్వడం ఒప్పందం ప్రకారమే జరిగిందన్నారు. ఇలా ముస్లీం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్తో ఎంఐఎం మద్దతు ఎందుకిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపాయి. కేసీఆర్, బీజేపీ మధ్య బంధం బలపడడంపై ఇప్పటికే అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్న కొన్ని విషయాలను బయటపెట్టింది.