ఒంగోలు : ప్రభుత్వ నిత్యావసర సరుకుల పంపిణీ దుకాణం (రేషన్ దుకాణం) ద్వారా పేదలకు సరుకుల పంపిణీలో చీరాల పట్టణంలోని 0882016నంబరుగల దుకాణ నిర్వాహకుడు పి వెంకట్రావును జిల్లా సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి అభినందించారు. పౌరసరఫరాల శాఖ కమీషనర్ నుండి మంజూరైన అభినందన పత్రాన్ని ఆమె మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయంలో అందజేశారు. డీలర్లు సక్రమంగా పేదలకు సరుకులు పంపిణీ చేస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుందని, ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.